కూరగాయల తొక్కలను ఎరువుగా ఎలా ఉపయోగిస్తామో కోడి గుడ్డు ( Chicken egg )పెంకులను కూడా ఎరువుగా ఉపయోగిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.మనం గుడ్లను కూడా వండుతున్నప్పుడు వాటి షెల్స్‌ను డస్ట్ బిన్ లోకి పోతూ ఉంటాయి.
తీసిపారేసే ఈ తొక్కలో ఎన్నో గుణాలు కూడా ఉన్నాయి.కూరగాయల తోక్కలను ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు.
ఇవి తేలికగా మట్టిగా మారి మంచి ఎరువుగా పనిచేస్తాయి.మంచి సేంద్రియ ఎరువుగా ( Organic manure )మారి మొక్కలకు బలాన్ని ఇవ్వడంతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
div class=”middlecontentim

అసలు ఈ గుడ్డు పొట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డు పెంకులు( Eggshells ) మొక్కల తోట్టి లో వేయవచ్చు.ఇది మట్టికి క్యాల్షియం లాంటి పోషకాలు, ఖనిజాలను అందిస్తుంది.గుడ్డు పెంకులను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.చర్మ సంరక్షణలో గుడ్డు పెంకులను కూడా చేర్చవచ్చు.కోడి గుడ్డు పెంకులను గ్రైండ్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి రాసి కాసేపు ఉంచిన తర్వాత కడిగేయాలి.
ఇలా చేయడం వల్ల ముఖం క్లీన్ అవుతుంది.అలాగే రంగు కూడా మారుతుంది.
div class=”middlecontentim

ప్రస్తుతం వర్షాకాలంలో ఇంట్లో కీటకాలు( Insects ) ఎక్కువగా కనిపిస్తాయి.కీటకాలను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు.పసుపు పళ్ళను శుభ్రపరచుకోవడంలో ఈ పెంకులు అద్భుతమైన ప్రభావం చూపుతాయి.గుడ్డు పెంకులను మెత్తగా పొడిగా చేసి ఈ పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి పేస్టులాగా చేసి దంతాల మీద రుద్దాలి.
దీంతో దంతాలు మళ్ళీ మెరుస్తాయి.గుడ్డు పెంకులు మురికి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడతాయి.పాత్రలో ఏదైనా కాలిపోయి మొండిగా ఉన్న మురికి పోకపోతే గుడ్డు పెంకును పలగొట్టి తోమాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని అందులో కోడి గుడ్డు పెంకులను వేయాలి.
చికాకు కలిగించే చర్మానికి ఉపశమనం అందిస్తుంది.ఇంకా మోకాళ్లకు, మోచేతులకు మేడకు నుంచి పట్టిస్తే నలుపు పోయి మంచి రంగు కూడా వస్తుంది.