హీరోలు మాత్రమే ఫైట్స్ చేస్తారా .? హీరోయిన్స్ అందుకు పనికి రారా ? కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే హీరోయిన్స్ పనికొస్తారా ? అంటే అస్సలు కానే కాదు.గన్స్ తో స్టైల్ గా రఫ్ఫాడించడం లో మేమే మాత్రం తక్కువ కాదు అంటూ కొంత మంది హీరోయిన్స్ దూసుకొస్తున్నారు.మరి తాజాగా వస్తున్న సినిమాల్లో గన్స్ తో డిశుం డిశుం చేయబోతున్న హీరోయిన్స్ ఎవరు నటిస్తున్న సినిమాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ వరుసలో కచ్చితంగా అందరికన్నా ముందు చెప్పుకోవాల్సిన హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).మీ 17న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విందు అందించడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్న కాజల్(kajal) గన్ తో కాలుస్తూ అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయట.ఇక ఇదివరకే సమంత (Samantha) ఎలాంటి సినిమాలు చాలా నటించింది.
ఫ్యామిలీ మ్యాన్( The Family Man ) వెబ్ సిరీస్ లో, యశోద (Yashoda )సినిమా లో తనదైన యాక్షన్స్ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసింది.ఇప్పుడు నార్త్ సిటడెల్ తో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో మా ఇంటి బంగారం సినిమాలో కూడా యాక్షన్స్ సీన్స్ లో గన్ తో ఇరగదీయబోతుందట.
ఇక డీజే టిల్లు సీక్వెల్( Tillu Square) లో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) కూడా గన్ తో గమాయించేసింది.ఇక కీర్తి సురేష్(Keerthy Suresh) కూడా ఈటీవీలో నటించిన సైరన్ (Siren )సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో నటించడంతో పాటు త్వరలోనే రివాల్వర్ రీటా అనే కొత్త సినిమాలో కూడా ఆమె ఇదే తరహా పాత్రలో నటించనుంది.డెకాయిట్ అనే సినిమాలో శృతిహాసన్(Shruti Haasan) కూడా కన్ను పట్టుకుని యాక్షన్స్ సన్నివేశాల్లో నటించింది.గతంలో క్రాక్ సినిమాలో కూడా రవితేజ సరసన అదే తరహా పాత్రలో నటించడం విశేషం.
ఇలా ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ అందాల ప్రదర్శన కాకుండా ఇలా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఇరగదీస్తూ తమదైన స్టైల్ లో రెచ్చిపోతున్నారు.