తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.అందులో నాగార్జున ( Nagarjuna ) ఒకరు…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ బాధ్యత ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
ఇక తను హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ వరుస సినిమాలతో అక్కినేని ఫ్యామిలీ హవాని చాలా రోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగేలా చేసాడు.
ఇక ప్రస్తుతానికి తను స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నప్పటికి ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఇప్పుడు తను చేయబోయే సినిమాల మీదనే అక్కినేని ఫ్యామిలీ అభిమానులందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఇక ఆయన కొడుకులు అయిన నాగ చైతన్య,( Naga Chaitanya ) అఖిల్ ( Akhil ) సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించడం లేదు.
ఇలాంటి క్రమంలో నాగార్జున ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ కలెక్షన్స్ కూడా రబట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక తన 100 వ సినిమా కోసం నాగార్జున ఆర్మీ జవానుగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే సినిమాగా ఈ స్టోరీ మొత్తంలో నాగార్జున తన సత్తా చాటుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే నాగార్జున ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి దర్శకుడుగా ఎవరు ఇస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఈ కథని అన్నపూర్ణ స్టూడియోస్ లో ( Annapurna Studios ) ఉన్న ఫిలిమ్ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ కథను నాగార్జున రాయించుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…