ఆపరేషన్ గరుడ శివాజీ ( Shivaji ) మళ్లీ వచ్చేసారు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి శివాజీ తర్వాత రాజకీయాలకు కాస్త దూరమయ్యారు.తాను రాజకీయాలలోకి ఏమాత్రం ఇన్వాల్వ్ కావడం లేదంటూ చెప్పేశారు .
ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈయన తిరిగి సోషల్ మీడియాలోనూ అలాగే సినిమాల పరంగా రాజకీయాల పరంగా చాలా యాక్టివ్ అయ్యారు మరొక రెండు వారాలలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.తిరిగి ఈయన తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) తరుపున పల్నాడు కేంఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీద్రంగా పొలిటికల్ పంచ్ లుపేల్చుతూ.
తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ మేము మరి అంత ఎదవల్లాగా కనిపిస్తున్నామా పల్నాడులో రాజకీయంగా పోటీ చేయడానికి ఎవరూ లేరా ఒకరు గుంటూరు నుంచి వచ్చారు మరొక నెల్లూరు నుంచి వచ్చారు ఇక్కడ పోటీ చేయడానికి ఎవరూ లేరా జగన్ బ్రో అంటూ ఈయన ప్రశ్నించారు.
లోకల్ అభ్యర్థులు ఎవరూ లేరా అంటూ ఈయన ప్రశ్నించారు.రాష్ట్ర భవిష్యత్ కోసం.మంచి వ్యక్తిని ఎన్నుకోండి.ఇద్దరే ఇద్దరు.ఒకరు జగన్.రెండు చంద్రబాబు.
ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలి అనేది మీరే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.రేపు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
చంద్రబాబుకి ఓటేయకపోతే రాబోయే తరాల భవిష్యత్ భూస్తాపితం అయిపోతుంది.మీరు మళ్లీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా మీ బతుకులు బంగాళాఖాతంలో కలిసిపోతాయి.ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ పత్తిపాటి పుల్లారావు అలాగే కృష్ణరాయులు గారిని గెలిపించాలి అంటూ ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
.