ఏపీలో రోజుకొక సర్వే ఫలితాలు వెలువడుతుండగా ఆ సర్వేల ఫలితాలు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏ సర్వే ఫలితాలు నమ్మాలో ఏ సర్వే ఫలితాలు నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు.
వైసీపీకి 2019 స్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోయినా మరీ తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూడీఎస్ పోల్ (UDS Pol)సర్వేలో 50.4 శాతం ఓట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైంది.
కూటమికి 42.6 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్(Congress), ఇతరులకు మిగతా ఓట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది.120 నుంచి 130 అసెంబ్లీ సీట్లలో 22కు పైగా ఎంపీ స్థానాలలో వైసీపీకి ?(YCP) విజయం దక్కుతుందని ఈ సర్వే చెబుతోంది.మిగతా స్థానాలలో కూటమి విజయం సాధిస్తుందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.కాంగ్రెస్, ఇతరులు మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సమాచారం అందుతోంది.
ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని సర్వేలో వెల్లడి కావడం నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతోంది.వైసీపీ నేతలు మాత్రం సర్వేలకు పొంగిపోకుండా కష్టపడితే మాత్రం వాస్తవంగా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.కొన్ని ప్రముఖ జిల్లాలలో వైసీపీకి వార్ వన్ సైడ్ అనే పరిస్థితులు ఉండటం పార్టీకి ఎంతో ప్లస్ అవుతుండటం గమనార్హం.వైసీపీ నేతలు మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది.
వైసీపీ నుంచి కష్టపడే అభ్యర్థులకే ఎక్కువగా టికెట్లు ఇవ్వడం కూడా జగన్ కు(Jagan) మరింత ప్లస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో వైసీపీ మరోమారు సులువుగానే అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతుండగా ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకే ఫేవర్ గా వస్తాయో లేదో చూడాల్సి ఉంది.గ్రామాల్లో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉండటం గమనార్హం.