ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) దుర్వినియోగం కారణంగా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఉన్నది లేనట్టుగా సృష్టిస్తూ భారీగా ఎడిట్ చేస్తూ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చాలామంది ఆకతాయిలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇలా ఇబ్బంది పడిన వారు రష్మిక, ఆలియా భట్, జాన్వీ కపూర్,మృణాల్, దీపికా పదుకొనే ( Rashmika, Alia Bhatt, Janhvi Kapoor, Mrinal, Deepika Padukone )ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.అయితే తాజాగా ఈ లిస్టులోకి సమంత కూడా చేరిపోయింది హీరోయిన్ సమంతకు సంబంధించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ( Choreographer Ganesh Acharya )మాస్టర్ తో సమంత రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది.అందులో గణేశ్ మాస్టర్ కాస్త గట్టిగానే ఆమెను పట్టుకున్నాడు.ఒళ్లంతా తడిమాడు, ఒక ముద్దు కూడా పెట్టాడు.అదంతా రిహార్సల్ లో భాగమే అయినప్పటికీ వీడియో బాగా వైరల్ అయింది.బహుశా పుష్ప సినిమా సమయంలో లో జరిగి ఉండొచ్చని చాలామంది.అయితే నిజానికి అందులో ఉన్నది సమంత కాదట.
గణేశ్ ఆచార్య మాస్టర్, హీరోయిన్ డైజీ షా( Daisy Shah ) కలిసి రిహార్సల్స్ చేస్తున్న క్లిప్ అది.దాన్ని ఏఐ ఉపయోగించి, ఒరిజినల్ హీరోయిన్ స్థానంలో సమంతను పెట్టారు.

అయితే చూడ్డానికి అచ్చం ఒరిజినల్ వీడియోలా అనిపించినప్పటికీ నిజానికి ఇదొక ఫేక్ వీడియో.ఇలాంటివి తయారు చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది.అయితే సరదా కోసం యువత చేస్తున్న ఇలాంటి పనులు వాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయం.ఈ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి.మరి ఈ వీడియో పై సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.ఈ వీడియో పై కొంతమంది సామ్ అభిమానులు మండిపడుతూ అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సమంతను డిమాండ్ చేస్తున్నారు.







