ఒక్క ఎపిసోడ్ కి 5 కోట్ల రెమ్యూనరేషన్.. కపిల్ శర్మ క్రేజ్ మామూలుగా లేదు?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే టాక్ షోలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి టాక్ షో( Talk Show ) లకు మంచి ప్రాధాన్యత లభిస్తుంది.

 Kapil Sharma The Great Indian Kapil Show Remuneration Details Goes Viral , Kapil-TeluguStop.com

అయితే ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా ఓటీటీలలో కూడా ఇలాంటి టాక్ షోలు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కపిల్ శర్మ ( Kapil Sharma ) వ్యాఖ్యతగా మారి ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ( The Great Indian Kapil show ) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ టాక్ షో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.

Telugu Bollywood, Kapil Sharma, Net Flixs-Movie

ఇక కపిల్ శర్మ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ప్రతి ఒక్క సినిమాలో కూడా హీరోలతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.కామెడీ పంచ్ డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పాలి.

ఇలా కమెడియన్ గా నటిస్తున్నటువంటి ఈయన వ్యాఖ్యతగా మారారు.ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తూ ఉన్నారు.

Telugu Bollywood, Kapil Sharma, Net Flixs-Movie

ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కపిల్ శర్మ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఒక్క ఎపిసోడ్ కి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక ఈ షో లోనే ఆడియన్స్ మధ్యలో కూర్చుని నవ్వుతూ కనిపించడం కోసం నటి అర్చన సింగ్ ఒక్కో ఎపిసోడ్ కి పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ( Remuneration) అందుకుంటారట ఈ విషయం తెలిసినటువంటి నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube