శోభన్ బాబు ( Shobhan Babu )నిజంగా ఒక ఐదు రోజులపాటు తన మొహాన్ని ఎవరికీ చూపించుకోలేక తననీ తాను ఇంట్లోనే బంధించుకున్నారట.అందుకు గల కారణం ఏంటి అంటే ఆయన నటించిన సంపూర్ణ రామాయణం ( Sampurna Ramayanam )చిత్రం.
వాస్తవానికి బాపూ ఎప్పుడైతే ఈ సినిమాను తీయాలి అనుకున్నాడో అప్పుడే అనేక విమర్శలు మొదలయ్యాయి.బాపు కార్టూన్స్ వేస్తాడు రమణ కామెడీ రాస్తాడు.
అలాగే ఈ సినిమాకి పనిచేసిన రచయిత ఆరుద్ర కమ్యూనిస్టు( Arudra ) భావాలు కలిగిన వాడు.ఈ ముగ్గురు కలిసి రామాయణం తీస్తారు అంటే జనాలు నమ్మలేదు.
అలాగే టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై నమ్మకం కలగలేదు.
పైగా రాముడు అయినా కృష్ణుడు అయినా తెలుగువారికి ఎన్టీఆర్ ( NTR )మాత్రమే.సరిగ్గా అదే టైంలో ఎన్టీఆర్ సైతం శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాను తీయాలనుకున్నారట.దాంతో బాపు వెళ్లి ఎన్టీఆర్ కి శోభన్ బాబుతో తీయబోయే సంపూర్ణ రామాయణం కథ చెప్పారట.
అలాగే ఆయన తీయాలనుకున్న శ్రీరామ పట్టాభిషేకానికి ఈ కాస్త సమయం ఉండడంతో ఆలోపే సినిమా తీసేస్తామని చెప్పి వచ్చారట అందుకు ఎన్టీఆర్ ఓకే అన్నారట.ఏడు లక్షల రూపాయల్లో పూర్తి కావలసిన సంపూర్ణ రామాయణం అవుట్ డోర్ షూటింగ్స్ చేయడం వల్ల 17 లక్షల రూపాయలు ఖర్చయింది.
అలాగే సినిమా పూర్తి అయిన తర్వాత శోభన్ బాబు ఓ రోజు ఎన్టీఆర్ ని కలిసారట.సినిమా ఎలా వచ్చింది ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని ఎన్టీఆర్ అడగగా రేపే విడుదలవుతుందని శోభన్ బాబు చెప్పారట.
సినిమా చాలా బాగా వచ్చింది అంటే ఈ మాట రిలీజ్ అయిన తెల్లవారి చెప్పమంటూ ఎన్టీఆర్ చెప్పారట.
ఎందుకంటే బాపు తీసే సంపూర్ణ రామాయణం పై ఆయనకు నమ్మకం తక్కువగా ఉండేదట.అలాగే సినిమా విడుదలైన మొదటి వారం అసలు ఎవరు చూడలేదట.దాంతో శోభన్ బాబు ఐదు రోజుల పాటు ఇంటికి పరిమితమయ్యారట.
ఎన్టీఆర్ కి మొహం చూపించడానికి శోభన్ బాబు వల్ల అవలేదు.కానీ రెండో వారానికి వసూలు పుంజుకున్నాయి మూడో వారానికి సినిమాలు ఎగబడి చూడటం మొదలుపెట్టారు.
అలా అనేక సెంటర్స్ లో వంద రోజులు ఆడింది హిందీలో డబ్బు చేస్తే కూడా 1973లో అత్యంత హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఐదవ హిందీలో నిలబడింది.శోభన్ బాబుకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈ చిత్రం.