టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇకపోతే శ్రీ లీల తాజాగా కొన్ని సీక్రెట్లను పంచుకుంది.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.శ్రీ లీల మాట్లాడుతూ.

మా తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్( Doctor ) కావాలనుకున్నాను.నేను విజయవాడ మూలాలు ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా అమెరికాలోనే అది తెలిపింది.కాగా కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్,( Yash ) శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న విషయం చాలా మందికి తెలియదు.యశ్ భార్య రాధికా పండిట్ కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే డాక్టర్ గా వ్యవహరించారట.
కాగా యశ్ ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఒక సినిమాలో నటించింది.యశ్ తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోందట.

అలాగే దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా శ్రీ లీలా దూరపు బంధువు అవుతుందట.రానా దగ్గుబాటి( Rana Daggubati ) ఆ మధ్య తన రియాలిటీ షోలో తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు.అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉందట.అయితే పుష్ప 2 సినిమా కంటే ముందు పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటెం సాంగ్ లో చేసిందట.
శ్రీ లీలా ఇంతవరకు చేసిన పాత్రలలో భగవంత్ కేసరి సినిమాలోని పాత్ర, పాటలలో కిస్సిక్ సాంగ్ అంటే తనకు బాగా ఇష్టం అని తెలిపింది.పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రెండు కోట్ల వరకు పారితోషం అందుకున్నట్టు చెప్పుకొచ్చింది.
ఆమె చేసిన గుంటూరుకారం, పుష్ప2, ధమాకా సాంగ్ లు కోట్లాది వ్యూస్‌తో టాప్ ప్లేస్ లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటోంది శ్రీ లీల.ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.