ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్( Betting Apps ) ని ప్రమోట్ చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది నమ్మి మోసపోవడంతో పాటు ఇప్పటికే చాలామంది చనిపోయిన విషయం కూడా తెలిసిందే.
అయితే ఇలా బెట్టింగ్ రిమోట్ చేస్తున్న వారిని టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్( VC Sajjanar ) చుక్కలు చూపిస్తున్నారు.ఇంతకాలం కొనసాగిన తమ ఆగడాలకు ఆయన ఫుల్‌స్టాప్ పెడుతున్నారట.
అయితే కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు హెచ్చరించారు.అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారట.

దీంతో చాలామంది యూట్యూబర్స్( Youtubers ) బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేఖంగా ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నారట.వైజాగ్ లోకల్ బాయ్ నాని,( Local Boy Nani ) ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్,( Bayya Sunny Yadav ) హర్ష సాయిల( Harsha Sai ) బాగోతాలు బయటపడిన విషయం తెలిసిందే.వీరి పేర్లను వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్లు బయట కూడా పెట్టారు.రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని సోషల్ మీడియాలో వారు విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ క్రమంలో వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి గురించి సజ్జనార్ ఇలా చెప్పుకొచ్చారు.

హర్ష సాయి చేస్తున్నదే తప్పు.అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి.తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట.ఏమైనా బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్ కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు.
వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన వాళ్లకు సంబంధం లేదు.ఈయనకు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆఫర్ చేశారట.అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి.
మీ ఫాలోయింగ్ ని మార్కెట్ లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతోంది.వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి.
వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి.ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ ఆయన సూచించారు.
దీంతో సోషల్ మీడియాలో సజ్జనార్ పేరు మారుమ్రోగిపోతోంది.







