కుంకుమ వల్ల ఇన్ని సమస్యలు తొలగిపోతాయా..?

సాధారణంగా కుంకుమ హిందూ సాంప్రదాయాలలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు.ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా నిత్యపూజలు కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

 How Many Problems Can Be Eliminated By Saffron, Saffron, Problems, Kujudu, Hindu-TeluguStop.com

అదేవిధంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహమైన స్త్రీ తప్పకుండా నుదుటిపై సిందూరం పెట్టుకొని ఉంటుంది.పెళ్ళైన మహిళ నుదుటిపై సిందూరం పెట్టుకోవడం వల్ల తన భర్త ఆయుష్షు క్రమంగా పెరుగుతుందని భావిస్తుంది.

కనుక పెళ్లైన మహిళలు సింధూరం దిద్దుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు.

అందుకోసమే ఈ కుంకుమతో వినాయకుడి నుంచి హనుమంతుడు వరకు పూజలు నిర్వహిస్తుంటారు.కుంకుమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

కుంకుమ మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.మన ఇంట్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఆంజనేయస్వామికి సింధూరంలో జాస్మిన్ ఆయిల్ వేసి ఐదు మంగళ వారాలు లేదా ఐదు శనివారాలు పూజించటం వల్ల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

మన ఇంట్లో ఏ వ్యక్తి కైనా అనారోగ్యం చేస్తే ఎన్నో మందులను ఉపయోగిస్తుంటారు.అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు.

ఇలాంటి సమయంలో కొద్దిగా సింధూరం కలిపిన నీటిని ఆ వ్యక్తిపై చల్లడం వల్ల వ్యాధి నుంచి కోలుకుంటారని పండితులు చెబుతున్నారు.మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల కుటుంబంలో కలహాలు, ఆందోళనలు ఏర్పడుతుంటాయి.

ఈ విధమైనటు వంటి ప్రతికూల పరిస్థితులను మన ఇంటి నుంచి పారద్రోలాలంటే మన ఇంటి ద్వారం పై కుంకుమలో కొద్దిగా నూనెను కలిపి పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది.ఈ విధంగా 40 రోజుల పాటు చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Significance of Kumkum Importance of Sindoor in Hindu Tradition

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube