తెలంగాణలో మరో మిలియన్ మార్చ్... కెసీఆర్ స్పందించేనా

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు  పెద్ద ఎత్తున ప్రతిపక్షాల, అధికార పక్షం సరికొత్త ఎత్తుగడలతో ఆసక్తికరంగా మారుతున్నాయి.అయితే ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న పరిస్థితుల్లో మరో సంచలన ప్రకటన చేసింది బీజేపీ.

 Another Million March In Telangana ... Will Kcr Respond  Telangana Politics,  Kc-TeluguStop.com

అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ లు త్వరితగతిన విడుదల చేయాలని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ లో ఏ మాత్రం కనికరం కలగడం లేదని, కేసీఆర్ మానవ మృగంగా మారారని బండి సంజయ్ అన్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంలో మిలియన్ మార్చ్ చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ వ్యాఖ్యానిస్తోన్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ బదిలీలు చేపట్టి ఖాళీలపై ఇప్పటికే ఒక క్లారిటీ రావడంతో ఇక త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తుందని కేసీఆర్ ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో బండి సంజయ్ పిలుపిచ్చిన మిలియన్ మార్చ్ తో  ముఖ్యమంత్రి కేసీఆర్ లో కదలిక వస్తుందా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఉద్యోగ నోటిఫికేషన్ లపై కేసీఆర్ రకరకాల సందర్భాలలో ప్రకటనలు కూడా ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఇక చివరికి నోటిఫికేషన్ లు మంజూరు చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక బీజేపీ మిలియన్ మార్చ్ కు పిలుపునివ్వడంతో ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే బీజేపీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ పై టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకున్నా మరి రానున్న రోజుల్లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.అయితే ఇక మిగతావాటిల్లాగే దీనిని కూడా ప్రభుత్వం అదుపు చేసే ప్రయత్నం చేస్తుందన్న విషయం తెలిసిందే.

Another Million March In Telangana Will KCR Respond Telangana Politics, Kcr, Trs Party , Bjp Party , Bandi Sanjay , Million March, Notifications - Telugu @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, March, Telangana, Trs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube