నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం.మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.
అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి.దీనికి కారణం ఏమిటో తెలుసా.అలా ఉన్నప్పుడు మనం ముందుగా శివున్ని దర్శించుకోవాలా?? నవగ్రహాలనా.తెలియాలంటే చదవండి.
నవగ్రహాలు శివాలయాల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం.
నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది.సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.ఆ దేవతలను నియమించింది శివుడే.దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవుడు కూడా శివుడే.ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి.
శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుండడానికి కారణం ఇదే.
సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు.సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
శివున్ని ముందు పూజించాలా?నవగ్రహాలనా??
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలను ముందుగా దర్శించాలా లేదా ఆ పరమ శివుడిని ముందుగా దర్శించాల అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.పరమేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు.కర్తవ్వాన్ని బోధించేది శివుడు.
ముందుగా శివున్ని దర్శించుకోవాలి.లేదా నవగ్రహాలను దర్శించినా.
ఆ పరమ శివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి.
అయితే శివాలయం కాకుండా కొన్ని ఇతర ఆలయాల్లోనూ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి.కానీ… ఏ ఆలయంలో నవగ్రహ మండపాలు ఉన్నా చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం.అలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి.
4 Attachments
LATEST NEWS - TELUGU