పొన్నియిన్‌ సెల్వన్‌ వెయ్యి కోట్ల వసూళ్లు ఎంత వరకు సాధ్యం?

తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అక్కడ మీడియా ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్లను రాబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండడంతో తప్పకుండా సినిమాకి తమిళనాడు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

 Ponniyin Selvan Movie Collections  , Ponniyin Selvan ,  Collections, Vikram , Is-TeluguStop.com

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మెల్ల మెల్లగా స్టార్ట్ అయి పుంజుకున్నాయి.ఈ సమయంలోనే హిందీ మరియు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

కనుక ఇతర భాషల్లో కూడా సినిమా స్టార్ కాస్టింగ్ నేపథ్యంలో తప్పకుండా మంచి ఓపెనింగ్ అయితే దక్కించుకునే అవకాశం ఉంది.కానీ మణిరత్నం సినిమా అంటే ఇంతకు ముందు స్థాయిలో ఇప్పుడు అంచనాలు ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండడం లేదు.

ఒకప్పటి ప్రేక్షకులు మణిరత్నం సినిమా అంటే ఎగబడి చూసేవారు, కానీ ఇప్పుడు ప్రేక్షకులు మారిపోయారు.

ఆయన సినిమాలను ఆదరించే వారు గతంలో మాదిరిగా లేరనే చెప్పాలి, అయినా సినిమా కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు.

కానీ ఇది ఒక పౌరాణిక నేపద్య సినిమాని మణిరత్నం ఎలా చేశాడు… ఒక భారీ స్టార్ కాస్టింగ్ తో సినిమా ను ఎలా తెరకెక్కించాడు అనేది చర్చనీయాంశంగా మారింది.అందుకోసం ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎలాంటి గ్రాఫిక్స్ వాడాడు అనేది కూడా అందరికీ అవసరం ఉంటుంది.

ఒకవేళ సినిమా నాసిరకంగా గ్రాఫిక్స్ ని కలిగి ఉంటే.లేదంటే పేలవమైన సన్నివేశాలను కలిగి ఉంటే సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచే అవకాశం ఉంది.

Telugu Maniratnam, Ponniyin Selvan, Surya, Trisha, Vikram-Movie

కలెక్షన్స్ వెయ్యి కోట్లు ఏమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు వచ్చే పరిస్థితి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు చేయాలంటే కచ్చితంగా అద్భుతం జరగాలి అన్నట్లుగా కొందరు అభిప్రాయం చేస్తున్నారు.తెలుగు సినిమాలకు ఉన్నంత ఆదరణ ఉత్తరాదిలో తమిళ్ సినిమాలకు లేదు, కనుక ఈ సినిమా అక్కడ కనీసం రూ.200 కోట్లకు పైగా వసూలు చేస్తేనే రూ.1000 కోట్ల మార్కు చేరుకునే అవకాశం ఉంటుంది.మరి అక్కడ తెలుగు భాషలో ఇతర భాషల్లో భారీగా వసూలను సాధిస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube