ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని మధుమేహం (డయాబెటిస్) సమస్య పట్టి పీడిస్తోంది.మనిషి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితంపై మధుమేహం తీవ్రంగా దెబ్బ కొడుతోంది.
ముఖ్యంగా నేటి ఆధునిక యుగంలో ముప్పై ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్నారు.మానవాళికి ముప్పులా మారిన ఈ మధుమేహం వచ్చిదంటే.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా ఆహారం విషయం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచే ఆహారానికి దూరం ఉండాలి.అయితే మధుమేహం వ్యాధి గ్రస్తులు బెండకాయ తింటే ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బెండకాయకు, మధుమేహానికి సంబంధం ఏంటీ అంటే.మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు బెండ కాయలో లభిస్తాయి.ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ ఇ తో పాటు ఐరన్, పొటాషియం, సోడియం, ఫైబర్, బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్ ఇలా ఎన్నో పోషకాలు బెండ కాయలో ఉంటాయి.అలాగే డయాబెటిస్ కు విరుగుడుగా కూడా బెండ కాయ పని చేస్తుంది.
ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే.

నిజానికి దీర్ఘకాలిక వ్యాధి అయిన మధుమేహాన్ని అదుపులో చేయడంలో బెండ కాయ అద్భుత పాత్రను పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మధుమేహంతో బాధ పడుతున్నారు బెండ కాయను తీసుకోవడం వల్ల.అందులో ఉండే మైరెసిటీన్ రక్తంలోని చక్కెర స్థాయిలో ఎప్పుడూ అదుపులో ఉండేలా చేస్తాయి.
అందువల్ల, డయాబెటిస్ రోగులు డైట్‌లో బెండకాయలను చేర్చుకుంటే మంచిది.
ఇక బెండకాయలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బెండలో ఉండే విటమిన్ కె ఎముకులను, దంతాలకు దృఢంగా మారుస్తాయి, ఫైబర్ అధిక బరువును, గుండె జబ్బులను నియంత్రిస్తుంది, విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే బెండకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచి.
ఎప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.కాబట్టి, మధుమేహం ఉన్న వారే కాదు.
అందరూ బెండ కాయను తరచూ తీసుకోవడానికి ప్రయత్నించండి.