ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి వలన జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు( Hair graying, falling out, dandruff ) లాంటి సర్వసాధారణ కేశ సమస్యలు వస్తున్నాయి.ఒత్తిడి లేకపోయినప్పటికీ కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే దానికి తినే ఆహారమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి.
వృధ్యాప్యానికి సంకేతమైన తెల్ల జుట్టు మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.
కొన్ని రకాల ఆహారాలను అతిగా తీసుకోవడం వలన జుట్టు తెల్లబడుతుంది.అంతేకాకుండా బయట ఆహారాలు జుట్టుపై ప్రభావం చూపిస్తాయి.అలాగే ఏ ఆహారం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది కూల్ డ్రింక్స్( Cool drinks ) ఎక్కువగా తాగుతూ ఉంటారు.అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం.
ఈ డ్రింక్స్ లో ఎక్కువ మొత్తంలో సోడా చక్కెర ఉంటుంది.ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి.
దీంతో మీ జుట్టు త్వరగా తెల్లబడుతుంది. చక్కెరతో చేసే స్వీట్లు( Sweets ), ఇతర ఆహారాలు తీసుకోవడం వలన కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది.చిన్న వయస్సు ఉన్న వారిలో కూడా వెంట్రుకలు వేగంగా తెల్లగా మారిపోతాయి.ఎందుకంటే జుట్టు పెరుగుదలకు నల్లబడేందుకు విటమిన్ చాలా అవసరం.కానీ చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ గ్రహించలేదు.ఈ కారణంగా జుట్టు త్వరగా తెలపడిపోతుంది.
మోనోసోడియం( Monosodium ) ఎక్కువగా ఉండే ఆహారాలు తరుచుగా ఎక్కువగా తీసుకుంటే వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి.
ఎందుకంటే మోనోసోడియం గ్లూటమేట్ మన శరీరంలోని మెటపాలిజం ప్రక్రియ పై ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా జుట్టు సమస్యలను కూడా పెంచుతుంది.ఉప్పును ఎక్కువగా తీసుకున్న కూడా జుట్టు తెల్లబడుతుంది.
అందుకే ఉప్పును ఎక్కువగా తినకూడదు.ఉప్పును ఎక్కువగా తినడం వలన శరీరంలో ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి.
దీని ప్రభావం జుట్టుపై పడుతుంది.ఎందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది.
దీని వలన జుట్టు సమస్యలే కాదు.కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.