ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయిన సినిమా ఛావా అనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(vicky kaushal) హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.తాజాగా ఛావా(Chhaava) తెలుగు వెర్షన్ విడుదల కాగా తెలుగు వెర్షన్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తెలుగులో ఈ సినిమాకు మూడు రోజుల్లోనే 10 కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
రాబోయే రోజుల్లో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్(OTT streaming date) ఖరారైందని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ (OTT streaming )కానుందని వార్తలు వస్తున్నాయి.హిందీ భారీ బడ్జెట్ సినిమాలు 56 రోజుల గడువుతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.నెట్ ఫ్లిక్స్ (Netflix)ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది.

నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ప్రశంసలు అందుకుకుంటూ ఉండటం గమనార్హం.ఛావా సినిమా ఓటీటీలో సైతం సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఛావా సక్సెస్ తో భవిష్యత్తులో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.







