టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి( Sai Pallavi ) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.సాయిపల్లవి ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది.
సాయిపల్లవి బాలీవుడ్ రామాయణ్ సినిమాతో( Ramayan ) మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సాయిపల్లవి డ్యాన్స్ అద్భుతంగా వేస్తారనే సంగతి తెలిసిందే.
వరుస సినిమాల్లో సాయిపల్లవి నటిస్తున్నా ఆమె కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.సాయిపల్లవి కొంతకాలం క్రితం సోదరి పెళ్లి పనులు చేయడంతో పాటు డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు.
తాజాగా సాయిపల్లవి సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ చేయడం ద్వారా వార్తల్లోకెక్కారు.నీలి రంగు చీరలో అదిరిపోయే స్టెప్స్ తో సాయిపల్లవి ఆహా అనిపించారు.ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

అయితే సాయిపల్లవి సోదరుని వివాహ వేడుక( Brother’s wedding ceremony ) ఎక్కడ జరిగిందనే ప్రశ్నకు సంబంధించి మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.పెళ్లికొడుకు సాయిపల్లవికి వరుసకు సోదరుడు అవుతాడని సాయిపల్లవి దగ్గరి బంధువుల ఇంట్లో ఈ వివాహ వేడుక జరిగిందని సమాచారం అందుతోంది.సాయిపల్లవి భవిష్యత్తు సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

లుక్స్ విషయంలో సైతం కేర్ తీసుకుంటున్న సాయిపల్లవి అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.సాయిపల్లవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఇతర హీరోయిన్లకు భిన్నంగా సాయిపల్లవి కెరీర్ విషయంలో అడుగులు వేస్తుండటం గమనార్హం.టాలీవుడ్ టైర్1 స్టార్ హీరోలు సాయిపల్లవికి ఛాన్స్ ఇస్తే ఈ హీరోయిన్ దశ తిరుగుతుందని చెప్పవచ్చు.
విమర్శలకు తావివ్వకుండా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నారు.







