ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల అరెస్టయి జైలుకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పుష్ప 2(Pushpa 2) సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు అయితే అల్లు అర్జున్ అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున తొక్కి సలాట జరగటం, ఈ ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ అభిమాని మరణించడంతో ఒకసారిగా ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఇక ఈ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టయ్యి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇలా ఒక రోజు మొత్తం అల్లు అర్జున్ జైలులో ఉండి అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇక ఈ కేసులో భాగంగా అల్లు అర్జున్ కు భారీగా ఉపశమనం కలిగిందని చెప్పాలి.అయితే తాజాగా అల్లు అర్జున్ కేసు గురించి నటుడు ప్రియదర్శి ( Priyadarshi ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రియదర్శి రామ్ జగదీష్ దర్శకత్వంలో కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నో బడీ’( Court state vs a nobody ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా హోలీ పండుగను పురస్కరించుకొని మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి తమ సినిమాకు అల్లు అర్జున్ కేసు చాలా బాగా ఉపయోగపడింది అంటూ తెలిపారు.అల్లు అర్జున్ కేసు విషయంలో లాయర్ నిరంజన్ రెడ్డి ఉపయోగించిన భాషను గమనించిన ‘కోర్ట్’ చిత్ర బృందం, కోర్ట్ సినిమాలోని డబ్బింగ్‌ను మరింత సహజంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ మా సినిమాకు ప్లస్ అయింది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.