ఈ ల‌డ్డు తింటే ర‌క్త‌హీన‌త నుంచి ఎముకల బ‌ల‌హీనత‌ వ‌ర‌కు అన్ని స‌మస్య‌లు ప‌రార్‌!

If You Eat This Laddu, All Problems From Anemia To Weak Bones Will Be Cured! Ragi Laddu, Healthy Laddu, Latest News, Health, Health Tips, Good Health, Anemia, Weak Bones, Sesame Seeds, Coconut. Ghee

ఆరోగ్యం ఎంత బాగుంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది.లేదంటే ఎంత డబ్బు ఉన్నా వృధానే.

 If You Eat This Laddu, All Problems From Anemia To Weak Bones Will Be Cured! Rag-TeluguStop.com

అందుకే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డైట్ లో పోషకాహారాన్ని చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు.అయితే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాల్లో ఇప్పుడు చెప్పబోయే లడ్డు కూడా ఒకటి.

ఈ లడ్డూను తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి ఎముకల బలహీనత వరకు ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు.అదే సమయంలో మరెన్నో ఆరోగ్య లాభాలు సైతం పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఓ లుక్కేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.నెయ్యి హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు రాగి పిండి వేసి వేయించుకొని తీసుకోవాలి.

మళ్లీ అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి వేయించుకొని తీసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న రాగి పిండి, నువ్వులు, కొబ్బరి తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి మరియు ఆరు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

Telugu Anemia, Coconut Ghee, Tips, Healthy Laddu, Latest, Ragi Laddu, Sesame See

ఈ రాగి లడ్డూలను ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుని రోజుకొక‌టి చ‌ప్పున తీసుకోవాలి.తద్వారా రక్తహీనత సమస్య దూరమవుతుంది.బలహీనమైన ఎముకలు బలంగా మారతాయి.

శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోయి గుండె ఆరోగ్యంగా మారుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం దూరం అవుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube