ఆర్థిక సమస్యల వల్ల ఒక మహిళ మెడలో గొలుసులు దొంగలించి కెళ్లి కటకటాల పాలైయ్యాడు పోలీసు.హైదరాబాద్ నేరెళ్ల చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ లో సెప్టెంబర్ 26న రాధా అనే ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా తన మెడలో 10 తులాల గోల్డ్ చైన్ ను లాక్కొని బైక్ పై ఓ వ్యక్తి పరారయ్యాడు.
వెంటనే మహిళా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
దొంగ టి ఎస్ ఎస్ పి ఎనిమిదో బెటాలియన్ కానిస్టేబుల్ రమేష్ గా గుర్తించారు.ఎనిమిది నెలల కింద సస్పెండ్ అయ్యి దాని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రమేష్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.







