ప్రస్తుతం అక్రమ వలసదారులను అమెరికా (us)ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్నప్పటికీ భారతీయులకు డాలర్స్‌పై (dollars)మమకారం చావడం లేదు.కుదిరితే రాచబాటలో లేదంటే దొడ్డిదారిలో అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు.
ఏది ఏమైనా సరే అమెరికాలో కాలు పెట్టాల్సిందేనన్న లక్ష్యంతో కదులుతున్నారు.ప్రమాదకర పరిస్ధితుల్లో ప్రయాణం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికాకు వెళ్లినా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీకి(Police and Border Security) దొరికి జైళ్లలో మగ్గుతున్నారు.
తాజాగా అమెరికాకు వెళుతూ ఓ భారతీయుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
గుజరాత్‌లోని సబర్కాంత్ జిల్లా (Sabarkanth district , Gujarat)ప్రాంటిజ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యా బిడ్డతో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.తీవ్ర అనారోగ్యానికి గురై ప్రమాదకర డాంకీ మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అతని మరణం తర్వాత భార్యా బిడ్డలు నికరాగ్వాలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది.బాధితుడు తన భూమిని అమ్మి రూ.కోటికి పైగా డబ్బును ఏజెంట్లకు ముట్టజెప్పాడని తెలుస్తోంది.

బాధితుడిని ప్రాంటిజ్ తాలూకాలోని మోయద్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్‌గా(Dilip Patel) గుర్తించారు.ఇతను తన భార్యా, బిడ్డతో కలిసి అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టానికి ఏజెంట్ల సాయం కోరాడు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.
కొద్దిరోజుల క్రితం ఓ ఏజెంట్.పటేల్‌ను నికరాగ్వా నుంచి అమెరికాకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశాడు.
దీంతో పటేల్ తన భార్యా బిడ్డలను తీసుకుని అమెరికాకు బయల్దేరాడు.అయితే మార్గమధ్యంలో నికరాగ్వా చేరుకున్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో పటేల్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

అయితే ఆ ఆసుపత్రిలో డయాబెటిస్‌కు మందులు లేకపోవడంతో పటేల్ కోమాలోకి వెళ్లి అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.అతని మరణంతో భార్యా బిడ్డలు నికరాగ్వాలో చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.అటు ఈ ఘటనపై కొందరు ఏజెంట్లు మృతుడి తల్లిని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.








