ఆ ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రిక్వెస్ట్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(allu arjun, trivikram) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది.

 Allu Arjun Request To Trivikram, Allu Arjun, Trivikram, Tollywood, Request-TeluguStop.com

కథ ఎలా ఉండబోతోంది ఏంటి అన్న వివరాలు మాత్రమే ఇంకా తెలియలేదు.కానీ వీరిద్దరి కాంబో మూవీ మాత్రమే ఇప్పటికే ఫిక్స్ అయినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఒక విషయంలో రిక్వెస్ట్ చేశారట.

అందుకు త్రివిక్రమ్ కూడా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ రిక్వెస్ట్ ఏమిటంటే.

తన కోసం ఒక్క ఆరు నెలలు వేచి వుండమని ఐ బన్నీ, త్రివిక్రమ్ ను కోరారట.వెకేషన్ కోసం, బాడీ డీటాక్సినేషన్ కోసం విదేశాలకు వెళ్లిన అల్లు అర్జున్ (allu arjun )ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ ( trivikram)వెళ్లి కలిసారు.ఐకాన్ స్టార్ కోసం తను తయారు చేసిన కథ ఫైనల్ నెరేషన్ ఇచ్చారట.

అలా ఇద్దరి మధ్య కాస్త ఎక్కువ సేపే డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.అయితే వీలైనంత త్వరగా ఒక సినిమా చేసి 2026 లో విడుదల చేయాలనుకుంటున్నానని, అలా ప్లాన్ చేసే సినిమా స్టార్ట్ చేసి, కొంత వర్క్ చేసిన తరువాత త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నది తన ఆలోచన అని బన్నీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Alluarjun, Tollywood, Trivikram-Movie

తన కోసం ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయమని త్రివిక్రమ్ ను కోరినట్లు టాక్.దానికి త్రివిక్రమ్ సరే అన్నట్లు తెలుస్తోంది.అయితే పారలల్ గా చేసే అవకాశం వుంటే వెయిట్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.అలా కాకుండా మొత్తం వేరే సినిమా చేసిన తరువాత తన సినిమా స్టార్ట్ చేయాలంటే చాలా సమయం పట్టేస్తుందని వివరించినట్లు తెలుస్తోంది.

ఒక సినిమా స్టార్ట్ చేసి కొంత చేసిన తరువాత ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నదే తన ఆలోచన అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.మొత్తం మీద త్రివిక్రమ్ ఎటూ వెళ్లడం లేదు.

బన్నీ సినిమా మీదే, బన్నీ సినిమా కోసమే, బన్నీ కోసం చేసిన మైథలాజికల్ టచ్ ప్రాజెక్ట్ ను ఫైన్ ట్యూన్ చేసుకుంటూ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తూ వెయిటింగ్ లో వుంటారట.కాకపోతే సినిమా మొదలయ్యేకి కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube