ఎర్రగా, నిగనిగలాడే టమాటాలు.ఏ కూరలో వేసినా ఎంతో రుచిగా ఉంటాయి.చాలా మంది నాన్‌వెజ్ కర్రీల్లో కూడా టమాటాలు వేస్తుంటారు.టమాటాలు వంటకు అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.నిజానికి రోజుకో టమాటా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరి ఆ ప్రయోజనాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ దాడి చేస్తోంది.
ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.అయితే టమాటాలో విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి, రోజుకు ఒక టమాటా తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలపడుతుంది.తద్వారా కరోనా వంటి భయంకర వైరస్‌ల నుంచి రక్షణ పొందొచ్చు.జలుబు, ఫ్లూ, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి టమాటా ఒక ఔషదంలా పనిచేస్తుంది.కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విటమిన్ ఏ టమాటాల్లో మనకు లభ్యమవుతుంది.అలాగే మధుమేహం సమస్యతో బాధపడేవారు టమాటాను తీసుకోవడం వల్ల.రక్తం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
రక్తపోటును కంట్రోల్ చేసే శక్తి కూడా టమాటాలకు ఉంది.
అదేవిధంగా, టమాటాల్లో బి, ఇ విటమిన్లు ఉంటాయి.
ఇవి మెడదు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.మతి మరుపును తగ్గిస్తాయి.
ఒత్తిడిని దూరం చేస్తాయి.ఇక రోజుకు ఒక టమాటా తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించి.
గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.చర్మ ఆరోగ్యానికి కూడా టమాటాలు గ్రేట్‌గా సహాయ పడతాయి.
కాబట్టి, ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటాలను డైలీ డైట్‌లో చేర్చుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.