వేసవిలో చల్లనీ పెరుగు( Curd ) ఎక్కువ మంది ప్రజలు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు.పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కానీ కొన్ని కాలాలలో పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామందిలో అపోహలు కూడా ఉన్నాయి.కానీ పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పెరుగును ప్రతిరోజు తీసుకుంటారు.
ఇంకా చెప్పాలంటే ఆరోగ్యానికి కావాల్సిన ఉపయోగకరమైన పోషకాలు అన్ని పెరుగులో ఉన్నాయి.పెరుగు తినడం వల్ల శరీరంలోని చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

పెరుగు ఆరోగ్యం, అందం పెంచే గొప్ప ఔషధం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.పెరుగు తినడానికి సరైన సమయం ఏంటో చాలా మందికి తెలియదు.ప్రతి రోజు మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తినడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.పెరుగు ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పెరుగు తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
అలాగే ప్రతిరోజు పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.

అదనంగా నిద్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు.పెరుగులో కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.
దీని వల్ల దంతాలు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి.ఇది ఒత్తిడిని, ఆందోళన దూరం చేస్తుంది.
పెరుగు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇంకా చెప్పాలంటే పెరుగు తినడం వల్ల చర్మం మృదువు గా మారుతుంది.పెరుగులో బెల్లం కలుపుకుని తినడం వల్ల వేసవిలో చలవ చేస్తుంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్యాకెట్లలో సేల్ చేస్తున్న పెరుగును తింటున్నారు.కానీ కొన్ని రోజుల క్రితం ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి కుండలో పెరుగును తయారు చేసుకునేవారు.