సాహసాలు చేయడం కొందరికి అలవాటు.సరదా సాహసాలు చూస్తే ముచ్చటగా అనిపించినా, అవే ప్రాణాలకు ముప్పుగా మారితే? అసలు ఊహించడానికే భయంగా ఉంటుంది కదా.అయితే, తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.మొసలితో ఓ వ్యక్తి ఆటలాడిన దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశాయి.
సామాన్యంగా మొసలి( Crocodile ) పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది.ఇవి భారీ శరీర నిర్మాణంతో, పదునైన పళ్లతో చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటాయి.కానీ, కొందరు తమ స్వంత సాహసాలను సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ప్రమాదాలను తలుపుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం.మొసలితో అటువంటి సాహసం చేసిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఓ పెద్ద మొసలి నీటిలో ఉందని చూసిన ఓ వ్యక్తి, నది ఒడ్డున( River Bank ) నిలబడి దానికి మాంసం( Meat ) ముక్క చూపిస్తూ దగ్గరకు రప్పించే ప్రయత్నం చేశాడు.మొసలి దగ్గరికి రాగానే, ఆహారాన్ని ఎత్తేసి వెనక్కి తగ్గాడు.దీంతో అసహనానికి గురైన మొసలి అతని వైపు వేగంగా దూసుకెళ్లింది.అయినా ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని ఆపలేదు.మళ్లీ అదే విధంగా ప్రయత్నిస్తూ మొసలిని మరింత రెచ్చగొట్టాడు.ఆ తర్వాత ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో, చివరికి మొసలి ఆహారాన్ని గట్టిగా పట్టుకుని నీటిలోకి వెళ్ళిపోయింది.
అయితే, ఏదైనా పొరపాటు జరిగి ఉంటే? కొంచెం కూడా అప్రమత్తంగా ఉండకపోతే? అంతే! అలాంటి క్రూర మృగం ముందు నిలబడడం అంటే నిజంగా ప్రాణంతో ఆటలాడడమే.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే విపరీతమైన స్పందన వచ్చింది.కొందరు “ఇలాంటి క్రూర జంతువులతో సరదాగా ఆడుకోవడం మంచిది కాదు” అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తుంటే.మరికొందరు సరదాగా స్పందింస్తున్నారు.“మొసలికి ఫుడ్ పెడుతున్నవు సరే.ఏమాత్రం పొరపాటు జరిగినా, మొసలికే ఫుడ్ అవుతాడు” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.







