ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజమౌళి.. ఈ ఇద్దరు డైరెక్టర్లలో నంబర్ వన్ ఎవరో మీకు తెలుసా?

ప్రస్తుతం ఇండియన్ సినిమా డైరెక్టర్లలో మోస్ట్ పాపులర్ డిమాండ్ డైరెక్టర్స్ అంటే ప్రశాంత్ నీల్( Prashanth Neel ) అలాగే రాజమౌళి( Rajamouli ) పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరు దర్శకుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించే విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Rajamouli Vs Prashanth Neel Box Office Race Details, Rajamouli, Tollywood, Prash-TeluguStop.com

సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ఇప్పటివరకు ఉన్న రికార్డులను మొత్తం చెరిపేస్తూ ఉంటాయి.అంతేకాకుండా కోట్లలో కూడా కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి.

రాజమౌళి ప్రతి సినిమాను అద్భుతమైన స్కేల్‌ లో ప్లాన్ చేస్తారు.ఆయనకి కెరిర్ లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ విజయాన్ని సాధించాయి.

Telugu Box, Dragon, Ntr, Mahesh Babu, Prashanth Neel, Rajamouli, Tollywood-Movie

అంతేకాకుండా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి.పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ చేస్తూ ఉంటారు రాజమౌళి.అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబుతో( Mahesh Babu ) తెరకెక్కించబోతున్న సినిమా 2000 కోట్లకు పైగా బిజినెస్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.హాలీవుడ్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయడం వల్ల 3000 కోట్ల వరకు రెవెన్యూ అందుకునే ఛాన్స్ కూడా ఉందని టాక్.

కానీ రాజమౌళి తో వచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఏ సినిమాకు అయినా సరే కనీసం రెండు మూడేళ్ల టైం తీసుకుంటూ ఉంటారు.

Telugu Box, Dragon, Ntr, Mahesh Babu, Prashanth Neel, Rajamouli, Tollywood-Movie

మహేష్ సినిమా పూర్తయిన తర్వాత మరొక సినిమాకు ఇంకో రెండేళ్లు పడితే, రాజమౌళి నుంచి వచ్చే మరో మూవీ కోసం ప్రేక్షకులు 2028 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది.అంటే, నాలుగు సంవత్సరాల్లో కేవలం ఒకే సినిమా బాక్సాఫీస్‌ పై కనిపించనుంది.ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.

ఆయన సినిమాలు బడ్జెట్ పరంగా 300-400 కోట్ల రేంజ్‌లోనే ఉంటాయి.కానీ, కలెక్షన్స్ మాత్రం 1000 నుంచి 1500 కోట్లకు వెళ్లేలా ఉండటం విశేషం.

కేజీఎఫ్ 2 అలా చేసింది.సలార్ 2 కూడా అదే రేంజ్ హిట్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ తో( NTR ) చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా అదే స్కేల్‌ లో ఉండే అవకాశం ఉందట.అయితే వీరిద్దరు కూడా ఎవరికి వారే సాటి అని చెప్పాలి.

మరి వీరిద్దరిలో విజేత ఎవరు అన్నది ముందు ముందు సినిమాల విజయాలే తెలపాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube