Anasuya : మేకప్ లేకుండా అనసూయని చూడడం కష్టమేనా.. వైరల్ వీడియో?

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఫిమేల్ ఆర్టిస్టులను మేకప్ లేకుండా చూడటం అనేది చాలా కష్టమని చెప్పాలి.ఎప్పుడు మేకప్ తో ఉండేవాళ్లు ఒకేసారి మేకప్ లేకుండా కనిపిస్తే చాలు వాళ్లను గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది.

 Is It Difficult To See Anasuya Without Makeup Viral Video-TeluguStop.com

అందుకే చాలా మంది సెలబ్రెటీలు బయటికి వచ్చినప్పుడు మేకప్ తోనే కనిపిస్తుంటారు.ఏ సమయంలో మేకప్ తోనే ఉంటారు.

కానీ కొన్ని కొన్ని సమయంలో మేకప్ లేకుండా కూడా దర్శనమిస్తూ ఉంటారు.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు మేకప్ లేకుండా మీడియా కంట పడగా వాళ్ల అసలైన అందాలని చూసి షాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

అయితే మేకప్ లేకుండా తాజాగా అనసూయ కూడా బయట కనిపించగా అనసూయని కూడా చూడటం కష్టంగా మారింది అంటున్నారు జనాలు.ఇంతకు మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉందో చూద్దాం.

మామూలుగా అందానికే అసూయ పుట్టించే అందంతో ఉంటుంది అనసూయ( Anasuya ).చాలా వరకు తన అందాలతోనే అందర్నీ తన వైపుకు మలుపుకుంది.ఈ వయసులో కూడా మంచి గ్లామర్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది.నిజానికి వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది.అలా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తన అందంతో అభిమానులుగా మార్చుకుంది.ఈ వయసులో కూడా చీరలో అయిన, మోడ్రన్ డ్రెస్సులో అయినా ఈమెను ఎవరు దాటలేరు అని చెప్పవచ్చు.

పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ బ్యూటీ ఎనర్జీ మాత్రం ఇంకా యాక్టివ్ గా ఉందని చెప్పవచ్చు.తను చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

తన ఒంపు సొంపులతో అందరినీ తన వైపు మలుపుకుంది అనసూయ.

తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది అనసూయ.ఆ తర్వాత జబర్దస్త్( Jabardast ) లో యాంకర్ గా అడుగుపెట్టి అందాలను ఆరబోసి తన డాన్సులతో మతి పోగొట్టిందో అప్పటినుండి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది ఈ బ్యూటీ.దాదాపు ఐదు ఆరు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయకు బాగా కలిసి వచ్చింది.

అక్కడి నుండే వెండితెరపై మరోసారి రీఎంట్రీ ఇచ్చింది.ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో పోషించి మంచి పేరు సంపాదించుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరగొట్టేసింది.పలు సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మరింత సక్సెస్ అందుకుంది.

అలా వెండితెరపై కూడా వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

ఏకంగా పాన్ ఇండియా మూవీ( Pan India Movie ) లలోనే అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.ఇక అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా అనసూయకు ఆహ్వానం ఉంటుంది.అలా బాగానే సంపాదించుకుంటూ పోతుంది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిరోజు తన అందాల విందు వడ్డిస్తూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పంచుకుంది.అందులో ఉదయాన్నే కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించగా.

అప్పుడే పడుకుని లేచినట్లు అనిపించింది.పైగా ఎటువంటి మేకప్ లేకుండా ఉండగా తన ఫేస్ కాస్త ఉబ్బినట్లుగా అనిపించింది.

దీంతో అది చూసి చాలామంది.అనసూయని మేకప్ లేకుండా చూడటం కష్టమే అని అంటున్నారు.

https://instagram.com/stories/itsme_anasuya/3071179766666947967?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube