మతపర భేదం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ లో హోలీ( Holi ) ఒకటి.నేడు హోలీ కావడంతో ఒకరిపై ఒకరు రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు.
అయితే హోలీ ఆడిన తర్వాత స్కిన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.కానీ జుట్టును పట్టించుకోరు.
నేరుగా షాంపూ చేసుకుంటారు.మీరు కూడా ఇలా చేస్తే కచ్చితంగా మీ కురులు డ్యామేజ్ అవ్వడం ఖాయం.
హోలీ రంగుల్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి.అవి చర్మం తో పాటు జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.
హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ ( Hair fall, hair damage, dry hair )వంటి ఎన్నో సమస్యలను తెచ్చి పెడతాయి.అందుకే హోలీ ఆడిన తర్వాత నేరుగా తలకు షాంపూ పెట్టుకోవడం మానుకోండి.
బదులుగా వాటర్ తో హెయిర్ మరియు స్కాల్ప్ ను శుభ్రంగా వాష్ చేసుకోండి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ( Egg white )మరియు మూడు టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించండి 40 నిమిషాల అనంతరం షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోండి.ఇలా చేయడం వల్ల జుట్టులోని హోలీ రంగు పూర్తిగా తొలగిపోతుంది.హోలీ రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల జరిగే నష్టం తగ్గుతుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

ఒకవేళ మీరు ఈ ఎగ్ మాస్క్ ను ఇష్టపడకపోతే మరొక సూపర్ హెయిర్ మాస్క్ కూడా ఉంది.దాని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పౌడర్ ను వేసుకోండి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు స్కాల్క్ కు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా హోలీ రంగుల వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!