ముఖంపై నల్లటి మచ్చలు( Dark Spots ) ఎంతకు పోవడం లేదా.? ఎన్ని ఖరీదైన క్రీములు, సీరంలు వాడిన ఎటువంటి ఫలితం కనిపించడం లేదా.? మచ్చలతో నిండిన ముఖాన్ని రోజు అద్దంలో చూసుకోలేక బాధపడుతున్నారా.? అయితే ఇకపై అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి మన చర్మ సమస్యలకు వంటింట్లోనే పరిష్కారాలు ఉంటాయి.సరైన రీతిలో ప్రయత్నిస్తే చాలా సులభంగా మరియు వేగంగా మచ్చలేని చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అందుకు ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చేతి నిండా ఫ్రెష్ తులసి ఆకులు( Tulsi Leaves ) మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ తులసి జ్యూస్ లో చిటికెడు కుంకుమపువ్వు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సూపర్ రెమెడీని కనుక పాటించారంటే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.