అల్లం( ginger ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అల్లం ను విరివిగా వాడుతుంటారు.
ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే అల్లం ఆహారానికి ప్రత్యేకమైన టేస్ట్ జోడిస్తుంది.అలాగే ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది.
అంతే కాదండోయ్ జుట్టు సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడంలో, ఊడిన జుట్టును మళ్ళీ మొలిపించడంలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ కురులకు అల్లాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను శుభ్రంగా పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు అల్లం జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేస్తే ఒక న్యాచురల్ హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.
ఈ టానిక్ ను స్కాల్ప్ కి అప్లై చేసి సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.టానిక్ అప్లై చేసుకున్న 40 నిమిషాల అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

అల్లం రక్త ప్రసరణను( Circulation of blood ) మెరుగుపరిచి జుట్టు వృద్ధిని పెంచుతుంది.కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.అల్లంలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్‌ను ఆరోగ్యంగా ఉంచి తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
అల్లంలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు తలపై చర్మ రంధ్రాలను శుభ్రపరిచి డాండ్రఫ్ సమస్యను దూరం చేయడంలో తోడ్పడతాయి.ఆముదం, అలోవెర జెల్ కూడా జుట్టుకు చక్కని పోషణ అందిస్తారు.
జుట్టు రాలడాన్ని నిరోధించి హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.