మనిషి జీవిత కాలంలో నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది.నీరు అనేది లేకపోతే మనిషి జీవించడమే కష్టం.
ఆహారం లేకపోయినా ఉండవచ్చు ఏమో కానీ నీరు లేకపోతే అస్సలు ఉండలేము.అంతేకాకుండా ప్రతిరోజు నిర్ణీత మొత్తంలో నీరు తాగుతూ ఉండాలి.
లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము.
ఒక రోజుకు 7 నుంచి 8 గ్లాస్ల నీరు కచ్చితంగా త్రాగుతూ ఉండాలి.శరీరాన్ని ఫీట్ గా ఉంచుకోవాలంటే నీటి అవసరం ఎంతో ఉంటుంది.
నీరు తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
నీరు మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది.కానీ దాని పరిమాణంలో తేడా వస్తే అది జీవితనికి సంక్షోభాన్ని సూచిస్తుంది.దాహం అనే భావన ద్వారా శరీరం నీటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది.
అయితే ప్రజలు అవసరానికి మించి నీటిని తీసుకోవడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది.చాలాసార్లు దాహం లేకుండా చాలామంది నీరు తాగుతూ ఉంటారు.
అయితే అలా చేయడం తీవ్రమైన అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశం ఉంది.ఆ అనారోగ్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి అన్ని వయసులో వారిలో వేగంగా వ్యాపిస్తుంది.దీనికి కారణం చెడు జీవనశైలి రక్తంలో చక్కర శాతం పెరిగిపోవడం వల్ల తరచుగా దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది.శరీరంలో సరిపడా నీరు లేకపోతే మూత్రపిండాలు పనిచేయవు.చాలాసార్లు ఆహారంలో మిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.మనిషి శరీరంలో ఎక్కువ చెమట పట్టడం మొదలైతే శరీరంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.అటువంటి పరిస్థితులలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ఎక్కువ నీటిని తాగాల్సిన అవసరం ఉంటుంది.
శరీరంలో నీరు తక్కువైతే మనిషిలో ఆందోళన పెరిగే అవకాశం కూడా ఉంది.