గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నింగ్ పై చిరు ఆసక్తికరమైన పోస్ట్!

ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను నెలకొల్పాడు.

 Megastar Chiranjeevi Post On Social Media, Megastar Chiranjeevi, Rrr, Ram Charan-TeluguStop.com

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకుని మరోసారి ఇండియన్ సినిమాను వేరే స్థాయిలో నిలబెట్టింది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి అదరగొట్టారు.

ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే.

ఈ అవార్డ్స్ లో నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లొబ్ అవార్డు వచ్చింది.దీంతో ఈ రోజు ఉదయం నుండి మన రాజమౌళి పేరు మారుమోగి పోతుంది.ఈయనను ప్రతీ ఒక్కరు పొగుడుతూ పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ అవార్డ్ రావడంపై పోస్ట్ చేసారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.ఎంతో అపూర్వమైన, చారిత్రాత్మక విజయం అని.గోల్డెన్ గ్లొబ్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ అవార్డు కీరవాణి గారు అని చెప్పుకొచ్చారు.అలాగే ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు.ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube