తెల్ల జుట్టు( White Hair ) అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిని కలవరపెడుతున్న సమస్య.వయసు పైబడిన వారే కాకుండా చిన్న వయసులో ఉన్నవారు కూడా తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.
జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడడం ఎంతో మేలు.అయితే జుట్టు త్వరగా తెల్లబడకుండా అడ్డుకోవడంలో ఇప్పుడు చెప్పబోయే ప్యాక్స్ అద్భుతంగా సహాయపడతాయి.
మరి లేటెందుకు ఆ ప్యాక్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.

హెయిర్ ప్యాక్ 1:
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( Henna Powder ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు సరిపడా బియ్యం నానబెట్టుకున్న వాటర్ వేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
నెలకు ఒకసారి ఈ ప్యాక్ ను కనుక వేసుకుంటే జుట్టు ఎక్కువ కాలం పాటు నల్లగా మెరుస్తూ కనిపిస్తుంది.ఒకవేళ తెల్ల వెంట్రుకలు ఆల్రెడీ ఉన్నా కూడా ఈ ప్యాక్ తో నల్లగా మారతాయి.

హెయిర్ ప్యాక్ 2: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి,( Amla Powder ) వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి మరియు సరిపడా నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.
తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా ఉంటాయి.హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది.







