ఇంటర్నెట్ లో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది.అది ఒక కొత్త రకం డోర్ బెల్ కు సంబంధించిన వీడియో.
దీంట్లో బటన్ నొక్కాల్సిన అవసరమే లేదు.వచ్చిన వాళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.
డైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళకి ఫోన్ వెళ్లిపోతుంది.
ఒక మహిళ తన ఇంటి గుమ్మానికి క్యూఆర్ కోడ్ ఉన్న చిన్న బోర్డు తగిలిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
ఎవరైనా ఇంటికి వస్తే, వాళ్లు ఆ క్యూఆర్ కోడ్‌ని ఫోన్ తో స్కాన్ చేస్తారు.దాంతో ఇంట్లో వాళ్ళకి ఆటోమేటిక్‌గా వీడియో కాల్ వెళ్లిపోతుంది.డోర్ బెల్ మోగించాల్సిన పని లేదు.తలుపు కొట్టాల్సిన అవసరమూ లేదు.
విన్షి బన్సల్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ “ఇదేం డోర్ బెల్ రా బాబు, భలే ఉందే.” అంటూ కామెంట్ పెట్టింది.DoorVi అనే స్మార్ట్ డోర్ బెల్స్ కంపెనీ వాళ్లు ఈ టెక్నాలజీని తీసుకొచ్చారంట.ఈ సిస్టమ్ ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, బిజీగా ఉన్నప్పుడు, లేదా ఇంట్లో చాలా మంది ఉండి గందరగోళంగా ఉన్నప్పుడు కూడా ఇది సూపర్ గా పనిచేస్తుంది అని ఆ అమ్మాయి చెప్పింది.
కొంతమందికి ఈ ఐడియా బాగా నచ్చింది.“వావ్, టెక్నాలజీ అంటే ఇది కదా” అంటున్నారు.కానీ చాలా మంది మాత్రం దీన్ని విమర్శిస్తున్నారు.పాత డోర్ బెల్లే బాగున్నాయి బాబు, అవి సింపుల్ గా, సేఫ్ గా ఉంటాయి అని కొందరు అంటున్నారు.
వీడియో కాల్ చేసి ఇంట్లోకి రమ్మనడం ఏంట్రా బాబు అని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, వీడియో కాల్ చేయడం చాలా చిరాకుగా ఉంటుందని చాలా మంది అంటున్నారు.“డోర్ బెల్ కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలా? ఛ ఛ, అస్సలు కుదరదు” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.దానికి కంపెనీ వాళ్లు రిప్లై ఇస్తూ “యాప్ అవసరం లేదు సార్.
మీ ఫోన్ కెమెరాతో స్కాన్ చేస్తే చాలు” అని క్లారిటీ ఇచ్చారు.
ఇంకొందరు భద్రత గురించి టెన్షన్ పడుతున్నారు.“ఎవడైనా రోడ్డు మీద పోయే వెధవ కూడా వీడియో కాల్ చేస్తాడు ఇది సేఫ్ కాదు బాసూ” అని ఒకాయన కామెంట్ పెట్టారు.ఇంకొందరైతే “ఇదంతా వేస్ట్, దీనికి బదులు మామూలు డోర్ బెల్లే నయం” అని కొట్టి పారేస్తున్నారు.“సరైన ప్లానింగ్ లేదు” అని కూడా అంటున్నారు జనాలు.నెగిటివ్ కామెంట్స్, విమర్శలు ఉన్నా కొంతమంది మాత్రం “ఈ డోర్ బెల్ ఎక్కడ దొరుకుతుంది? కొనుక్కుంటాం” అని లింక్ అడుగుతున్నారు.