టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్లో హైదరాబాదులో పూర్తి చేసుకోగా ఇప్పుడు రెండవ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఒడిశాకు( Odisha ) వెళ్ళినట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.
ముఖ్యంగా గత వారం రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

మహేష్ బాబుకు సంబంధించిన లుక్స్, అలాగే ఒడిస్సాలో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్, ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు ఇలా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.తాజాగా కూడా మరో వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే ఏకంగా మహేష్, రాజమౌళి సినిమా గురించి సూపర్ లీక్ ఇచ్చారు ఒడిశా డిప్యూటీ సీఎం.
( Odisha Deputy CM ) అసలేం జరిగిందంటే.SSMB 29 షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతోంది.
మహేష్ అలాగే SSMB 29లో కీలకంగా కనిపించబోయే ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు ఈ షెడ్యూల్ లో చిత్రీకరణకు హాజరయ్యారు.

అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు.రాజమౌళి SSMB 29 పై ఎంత సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో అంతే ఓపెన్ గా లీకేజీ రాయుళ్లు ఛాలెంజ్ చేస్తూ అవుట్ డోర్ షూట్ ని లీక్ చేసేస్తున్నారు.తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం SSMB 29 పై చేసిన ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
గతంలో మల్కాన్ గిరిలో పుష్ప 2 షూటింగ్, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి SSMB 29 చిత్రం.టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు, మోలీవుడ్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ ఉన్న ప్రియాంకా చోప్రా తో కలిసి రాజమౌళి కోరాపుట్ లో షూట్ చేస్తున్నారు.
ఒడిశాలో షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్ స్కెప్ సంపద ఉందని రుజువు చేస్తుంది.ఒడిశా పర్యటక రంగానికి ఇది చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.అన్ని రకాల సినిమా షూటింగ్ కి ఇది గమ్య స్థానం అవుతుంది.షూటింగ్ చేసుకోవడానికి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా,అందుకు తగిన వసతులు కల్పిస్తామని మాటిస్తున్నాము అంటూ SSMB 29 లో పృథ్వీ రాజ్, ప్రియాంక చొప్రా నటిస్తున్నట్టుగా సూపర్ లీక్ ఇచ్చారు ఒడిశా డిప్యూటీ సీఎం.
దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.







