మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేయడం, ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరొక హీరో ఓకే చేసి హిట్టు కొట్టడం కొన్నిసార్లు ఫ్లాప్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.సినిమా సరిగ్గా ఆడదేమో అన్న అనుమానంతో కథను రిజెక్ట్ చేసి, ఆ సినిమా మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా కూడా అలాంటిదే.డార్లింగ్ ప్రభాస్( Prabhas ) రిజెక్ట్ చేసిన సినిమాను అల్లు అర్జున్( Allu Arjun ) ఓకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
ఆ సినిమా మరేదో కాదండోయ్ ఆర్య.( Arya )

ఈ సినిమా ప్రభాస్ చేయాల్సిన సినిమా.ముందుగా ఈ సినిమా కథను ప్రభాస్ కే వినిపించాడట దర్శకుడు సుకుమార్.కథ ప్రభాస్ కు బాగా నచ్చిందట.
అందుకు ప్రభాస్ వన్ సైడ్ లవ్ ఉండే పాత్రలు చేయను అని సున్నితంగా నో చెప్పేసారట.అలా ప్రభాస్ వదులుకున్న ఆ సినిమా కాస్త బన్నీ చేతికి వెళ్లి బన్నీ ఓకే చేయడం ఆ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడం ఇలా ఇవన్నీ కూడా చకచగా జరిగిపోయాయట.
ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల విషయానికి వస్తే.ఇద్దరు పాన్ ఇండియా స్టార్ లుగా మారి వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.ప్రభాస్ చివరగా సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అల్లు అర్జున్.ప్రస్తుతం ప్రభాస్ వరుసగా అరడజన్ సినిమాలతో బిజీబిజీగా ఉండగా, పుష్ప సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ తన నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించి కొన్ని రకాల వార్తను వినిపిస్తున్నాయి కానీ ఆ వార్తలపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.







