రాగి ఉంగరాలను, కడియాలను ధరిస్తే ఆరోగ్యానికి మంచిదా..?

పూర్వం కాలంలో నివసించిన ప్రజలు ఎక్కువగా రాగి వస్తువులను ఉపయోగిస్తుండేవారు.ఇంకా చెప్పాలంటే పురాతన కాలంలో నుండి మన దేశంలో రాగిని ఎంతో పవిత్రమైనదిగా బావిస్తారు.

 Is Wearing Copper Rings And Bracelets Good For Health Details, Copper Rings, Cop-TeluguStop.com

రాగి చెంబులు, బిందెలను మన పూర్వికులు ఎక్కువగా వాడేవారు.రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని పవిత్ర జలంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించేదిగా భావిస్తారు.

చాలా పరిశోధనల్లో సైతం ఇది నిజమేనని తెలిసింది.అంతేకాకుండా రాగిని ఉంగరాల రూపంలో వేళ్ళకు, కడియాల రూపంలో చేతులకు కాళ్ళకు ధరించే అలవాటు కొంతమంది నేటి సమాజంలో కూడా ఉపయోగిస్తున్నారు.

రాగి ఉంగరాలు, కడియాలు ధరించటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఆయుర్వేద శాస్త్రాల్లోసైతం రాగి ఉంగరం ధరించటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని రాసి ఉంది.

ముఖ్యంగా వేడి అధికంగా ఉండే ప్రాంతాలలో ఉండే వారు సూర్య కిరణాల ప్రభావం కారణంగా శరీరంలో ఏర్పడే రుగ్మతలను తొలగించడానికి రాగి ఉంగరాలు, కడియాలు దోహదపడతాయని చాలా మంది ప్రజల నమ్మకం.అందుకే రాగి ఉంగరాలు , కడియాలు ధరిస్తే కొంతకాలానికి అవి నల్లగా మారిపోయి వర్ణాన్ని కోల్పోతూ ఉంటాయి.

రాగి ఉంగరాలు, కడియాలు ధరించటం వల్ల కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తొలగిపోతాయని, ఆర్ధరైటిస్ తో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా రాగితో తయారు చేసిన బ్రాస్ లైట్, కడియాలను ధరించాలని పూర్వం ప్రజలు ఎక్కువగా నమ్మేవారు.

శరీరంలో విషపదార్ధాలను తొలగించటంతో పాటు, హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది.ఒత్తిడిని తగ్గించటంతోపాటు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గించడంతోపాటు, రక్త సరఫరా సవ్యంగా జరిగేలా చేస్తుంది.ఈ క్రమంలో అనేమంది సామాన్యులు అందుబాటులో ధరలో ఉన్న రాగి రింగులు, కడియాలు, బ్రాస్ లైట్లను ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇదే కాకుండా వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంత మంది రాగి రింగులను ధరించటం వల్ల గ్రహాలు అనుకూలిస్తాయని నమ్ముతుంటారు.

Health benefits of wearing Copper Jewelry

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube