సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని,కృష్ణానదిలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల ద్వారా సమర్ధవంతంగా నీరు అందించే విధానం తెలియకనే తెలంగాణలో కరువు ఏర్పడిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్,కోదాడ మాజీ ఎమ్యల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో ఎండిన పొలాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోయారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు,నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







