ప్రధాని నరేంద్ర మోదీ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారట…! అంతా నేనే…సమస్తం నేనే చేస్తున్నాను…నేనొక్కడినే చేస్తున్నాను.అన్నట్లుగా ఉందట ఆయన వ్యవహారశైలి.
అంతా నేనే అనుకోవడం ఒక మానసిక వ్యాధి అని అట…! ఈ విమర్శలు చూస్తుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నట్లుగా ఉంది కదా…! మోదీపై ఈ విమర్శలు చేసిన నాయకుడు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.గత ప్రభుత్వాలన్నీ పనికిమాలినవి అన్నట్లు మోదీ మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రతిపక్షాలు ఆయన్ని ‘రాంగ్ ప్రైమ్‌మినిస్టర్’ అంటున్నాయని, ఈయన భారతీయుడిగా పుట్టినందుకు సిగ్గుపడాలని ప్ర జలు అంటున్నారని విపక్షాలు చెబుతున్నాయని, అయితే దీన్ని తాను అంగీకరించనని అన్నారు.ఆయన విదేశాలకు వెళ్లొచ్చు, తన ప్రత్యర్థులను టార్గెట్ చేయొచ్చు, కాని సర్వం తానేనని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
తాను అధికారంలోకి రాకముందు భారతీయులు తాము ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడేవారని మోదీ ఈమధ్య విదేశాల్లో వ్యాఖ్యానించారు.దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
దీనిపై ఒమర్ విమర్శిస్తూ మోదీ ఏడాది క్రితం (ప్రధాని కాకముందు) నిజంగా సిగ్గుపడే పరిస్థితి ఉండేదన్నారు.ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటికీ ఆయనను అమెరికా తమ దేశం రాకుండా నిషేధించిందని గుర్తు చేశారు.
మొత్తం మీద మోదీకి అహంకారం తలకెక్కినట్లు అర్థమవుతోంది.ఆయన తన తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా?
.