షర్మిల పాదయాత్ర అందుకేనట !

చేవెళ్ల నుంచి వైఎస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.ఈ యాత్రను షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు.

 Sharmila Sensational Comments On Kcr-TeluguStop.com

ఈ సందర్భంగా వైయస్ షర్మిల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అసలు తాను పాదయాత్ర చేపట్టింది కెసిఆర్ అహంకారం దించేందుకు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

టిఆర్ఎస్ అక్రమాలను బయటపెట్టేందుకు తెలంగాణలోని ప్రతి పల్లెకు తాను వస్తానని,  ప్రజలతో మమేకమవుతాను అని షర్మిల ఈ సందర్భంగా ప్రకటించారు.

        ఇదే చేవెళ్ల నుంచి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 18 ఏళ్ల క్రితం పాదయాత్రకు మొదటి అడుగు వేశారని షర్మిల గుర్తు చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని, తెలంగాణలో అసలు సమస్యలు లేవని నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానని షర్మిల సవాల్ చేశారు.కెసిఆర్ కుటుంబ పాలన అంతానికే తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు.

కెసిఆర్ అవినీతిని తాను బయటపడతానని , కేసీఆర్ కు  అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతాను అంటూ చెప్పారు .
   

Telugu Congress, Padayathra, Telangana, Trs, Ys Sharmila-Telugu Political News

  వందల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారని,  కళ్లముందు 1.90 లక్షల ఉద్యోగాలు కనిపించినా, నోటిఫికేషన్లు  లేవు అంటూ ఆమె విమర్శించారు.  నిరుద్యోగులు హమాలీలుగా మారారని ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారు అంటూ కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో దళితులపై దాడులు బాగా పెరిగాయని,  మిగులు బడ్జెట్ ఉన్నా,  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని,  బీసీలకు ప్రభుత్వం అసలు ఏం చేసిందో చెప్పాలి అని షర్మిల నిలదీశారు.పూర్తిగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకునే షర్మిల పాదయాత్ర కొనసాగేలా కనిపిస్తోంది.

టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బిజెపి లను సైతం టార్గెట్ చేసుకుని తమ పార్టీ గ్రాఫ్ పెంచేలా షర్మిల ముందడుగు వెస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube