బలిదేవత సోనియా, ముద్దపప్పు రాహుల్ కు స్వాగతం అంటూ పోస్టర్ల కలకలం..!

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు శనివారం రోజున చాలా ఘనంగా ప్రారంభించారు.ఈ సమావేశాలు సెప్టెంబర్ 16, 17వ తేదీన సాయంత్రం వరకు జరగనున్నాయి.

 Welcome To The Bali Devatha Sonia And Muddapappu Rahul Posters Are Viral In Hyde-TeluguStop.com

ఈ సమావేశాలను త్రాజ్ క్రిష్ణ హోటల్లో శనివారం ప్రారంభం చేసి రాత్రి 8 గంటల వరకు నిర్వహించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే(Mallikarjuna Kharge) ఈ సమావేశాలను ప్రారంభించడానికి ముందు జెండా ఆవిష్కరించారు.

మొదటిరోజు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పలు అంశాలపై నేతలంతా చర్చించారు.రాబోవు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఏ విధమైన వ్యూహాలు చేయాలి.

Telugu Congress, Cwc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telangana, Thuk

ప్రజల సౌకర్యార్థం ఎలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టాలి అనే వాటిపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఈ సమావేశానికి పలు రాష్ట్రాల టిపిసిసి అధ్యక్షులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు సీనియర్ లీడర్లు హాజరయ్యారు.ఆదివారం వరకు సాగనున్న ఈ సమావేశాలు అనంతరం తుక్కుగూడ(Thukkuguda) లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

Telugu Congress, Cwc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telangana, Thuk

కట్ చేస్తే.హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి రాహుల్ (Rahul), సోనియా గాంధీ (Sonia Gandhi) లు వచ్చారు.ఇదే తరుణంలో నగరంలోని పలుచోట్ల రాహుల్, సోనియాలను విమర్శిస్తూ పలు రకాల ఫ్లెక్సీలు వెలిశాయి.

బంజారాహిల్స్ లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టి సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని ఆ ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.ముద్దపప్పు, బలిదేవతలకు స్వాగతం అంటూ అందులో ఉండడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చా నియాంశంగా మారింది.

దీంతో చాలామంది కాంగ్రెస్ నాయకులు ఈ ఫ్లెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube