ఇండియాలో కరోనా వైరస్ ఎంత మందిని బలితీసుకుంటుందో అంతే స్థాయిలో ఆకలి చావులు, లాక్ డౌన్ కష్టాలతో మరణాలు నమోదు అవుతున్నాయి.వలస కార్మికులు తీవ్రమైన ఆర్థికమైన ఇబ్బందులతో చనిపోవడం మనం ఇప్పటి వరకు చూశాం.
తాజాగా ఒక యువ నటుడు కరోనా కారణంగా మృతి చెందాడు.ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యి మృతి చెందలేదు.
కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
పలు హిందీ సీరియల్స్ సినిమాలతో పాటు పంజాబీ సినిమాల్లో కనిపించిన నటుడు మున్మీత్ గైవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
గత రెండు నెలలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.ఆయన నటుడిగా మంచి పేరు దక్కించుకున్నా ఈమద్య కాలంలో ఆయనకు చేతిలో డబ్బులు లేక పోవడంతో పాటు పలు విషయాల్లో ఇతరులపై ఆదారపడాల్సి వచ్చింది.
29 ఏళ్ల మున్మీత్ గైవాల్ తన భార్యతో కలిసి ముంబయిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.అప్పులు చేసి వాటిని తీర్చలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్న మున్మీత్ చివరకు ఆత్మహత్యకు సిద్దం అయ్యాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు.మున్మీత్ మరణం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.