తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన చేసిన సినిమాలు ఆయన్ని కెరియర్ లో టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాయి.
ఇక అప్పట్లో ఆయన మాస్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తూ ఉండేవాడు.ఇక మధ్యలో కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ ను కూడా చేశాడు కానీ అవి పెద్దగా ఆడలేదు.
దానికి తోడుగా చిరంజీవి( Chiranjeevi ) క్రేజ్ కూడా కొద్ది వరకు తగ్గింది.కానీ ఆయన మాత్రం నటుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.
చిరంజీవి ఆ సినిమాల ద్వారా తనలోని నటుడుని బయటికి తీశాడు.అవి ఏ సినిమాలో అంటే ఆపద్బాంధవుడు,( Aapadbandhavudu ) రుద్రవీణ( Rudraveena ) లాంటి సినిమాలు.
ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ నటన పరంగా చిరంజీవి మాత్రం తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి.ఇక ఈ సినిమాల్లో చిరంజీవి కాకుండా కమలహాసన్( Kamal Haasan ) చేసుంటే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేవని అప్పట్లో మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి.
నిజానికి ఆర్ట్ సినిమాలు చేయాలంటే అది కమలహాసన్ వల్లే అవుతుందని అప్పట్లో చాలామంది అనుకునేవారు కానీ చిరంజీవి కూడా తన నటనతో ప్రేక్షకులందరిని మెప్పించాడు.అయినప్పటికీ చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ముందు ఈ సినిమాలు నిలబడలేకపోయాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ విశ్వంభర( Viswambhara ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా తో ఒక భారీ హిట్ కొట్టాలని చిరంజీవి చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయడానికి డైరెక్టర్లను లైన్ లో పెడుతున్నాడు…