డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వమానవుడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదని తెలిపారు.
అణగారిన వర్గాలకు ఆశాదీపం అంబేద్కరన్న కేసీఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడమేనా.ఆయన ఆశయాలు సాధించొద్దా అని ప్రశ్నించారు.
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు.అంబేద్కర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వబోతుందన్నారు.
ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున అవార్డులను ప్రదానం చేస్తామని చెప్పారు.ఇందుకోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదన్నారు.
విశ్వ మానవుడి విశ్వ రూపాన్ని చూపించేందుకే విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామని స్పష్టం చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని వెల్లడించారు.