దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ( Nayanatara )గురించి అందరికీ సుపరిచితమే.దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.
ఇక గత ఏడాది డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినటువంటి నయనతార ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు పిల్లల బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇకపోతే తాజాగా తమిళనాడు చిత్ర పరిశ్రమలో జరిగిన ఒక అవార్డు వేడుకలకు నయనతార హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రముఖ దర్శకుడు మణిరత్నం( Mani Ratnam) చేతుల మీదుగా నయనతార అవార్డును అందుకున్నారు.ఈ క్రమంలోనే వేదికపై నయనతార మణిరత్నం గారి పాదాలకు నమస్కరించి ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకుండా వేదికపై మాట్లాడుతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.
ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ హీరోయిన్ అయిన వారికంటూ కొన్ని కోరికలు ఉంటాయి.కొన్ని సందర్భాలలో వాటిని బయట పెడుతుంటారు.

ఈ క్రమంలోనే నయనతార సైతం తన చిరకాల కోరికను బయటపెట్టారు.తాను చాలా మంది దర్శకులతో పని చేశానని అయితే ఇప్పటివరకు మణిరత్నం గారి దర్శకత్వంలో పని చేయలేదని తెలిపారు.ఎప్పటికైనా ఆయన డైరెక్షన్లో సినిమా చేయడమే తన కోరిక అంటూ నయనతార వెల్లడించారు.గతంలో తన దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం తనకు వచ్చిన కొన్ని కారణాలవల్ల ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

మరి మణిరత్నం నయనతార కోరికను నెరవేరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్( Kamal Hassan ) హీరోగా ఓ సినిమాని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఒకవేళ ఈ సినిమాలో నయనతారకు మణిరత్నం అవకాశం కల్పిస్తారా… లేదా అనేది వేచి చూడాలి.








