మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తులసి మొక్కను ఒక దైవ సమానంగా భావించి పూజలు చేస్తుంటారు.
కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో విరివిగా ఉపయోగిస్తారు.గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో తులసి ప్రాధాన్యత ఎంతో ఉంది.
తులసిని గ్రంథాలలో ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనదిగా భావిస్తారు.తులసి అంటే మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది.
మహావిష్ణు ఆలయాన్ని సందర్శించినప్పుడు తులసి మాలతో స్వామివారికి పూజించి నమస్కరించడం వల్ల స్వామివారు అనుగ్రహం మన పై కలిగి కోరిన కోరికలను నెరవేరుస్తాడు.తులసి లేనిదే విష్ణుపూజ అసంపూర్తిగా ఉంటుంది.
స్వామివారికి సమర్పించే తీర్థప్రసాదాలలో కూడా తులసిని ఉపయోగిస్తారు.ఈ విధంగా తులసి వేసిన తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది తులసిమాలను చాలా మంది భక్తులు ధరిస్తారు.శివ భక్తులు రుద్రాక్షమాలను ధరిస్తే విష్ణు భక్తులు తులసి మాలను ధరిస్తారు.ఎంతో పవిత్రమైన తులసి మాలలను ధరించడం వల్ల మనసు ప్రశాంతత కలిగి ఉంటుంది.

బుధ, గురు గ్రహాలను అనుగ్రహం మనపై కలిగి మరణించిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.ఈ విధంగా ఎంతో పవిత్రంగా భావించే తులసి మాలలను ధరించే వారు తప్పకుండా కొన్ని నియమ నిష్టలను పాటించాలి.అయితే ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
* తులసి మాలలను ధరించే వారు ముందుగా మాలను గంగాజలంతో శుభ్రం చేసి ఆరిన తర్వాత మాత్రమే ధరించాలి.
*తులసి మాలను ధరించిన విష్ణుభక్తులు ప్రతిరోజు విష్ణుమూర్తి జపం చేయాల్సి ఉంటుంది.అప్పుడే స్వామి వారి అనుగ్రహం మనపై కలిగి మన కోరికలు నెరవేరుతాయి.
*తులసి మాలలు ధరించిన భక్తులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం, చేపలు వంటి ఆహార పదార్థాలను తినకూడదు.
ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ తులసి మాలలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.