Prabhas Maruthi : ప్రభాస్ మారుతి సినిమాలో విలన్ రోల్ లో స్టార్ హీరో.. ఎవరంటే?

ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఈయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.

 Bollywood Star As Villain In Prabhas Maruthi Movie Details, Prabhas, project K-TeluguStop.com

ఈ సినిమా కంటే ముందు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన డార్లింగ్ క్రేజ్ ఈ సినిమా తర్వాత మాత్రం ప్రపంచ నలుమూలలా విస్తరించింది.

అందులో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

వీటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూట్ జరుపు కుంటున్నాయి.

వీటితో పాటు డార్లింగ్ మరో సినిమా షూట్ కూడా సైలెంట్ గా పూర్తి చేస్తున్నాడు.ఇలా మూడు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

డార్లింగ్ చేస్తున్న సినిమాల్లో మారుతి సినిమా ఒకటి.రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.

Telugu Salaar, Maruthi, Nidhhi Agerwal, Prabhas, Prabhas Maruthi, Project, Raja

ఈ సినిమాను మారుతి పక్కా యాక్షన్ తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించ బోతున్నాడట.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.అది ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించ బోతున్నారు అనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను విలన్ గా ఫిక్స్ చేశారట.గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ వైరల్ అవుతున్న ఇప్పుడు ఇది నిజమే అని తెలుస్తుంది.

ఆయనను విలన్ రోల్ కోసం సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం.ఇన్ని విషయాలు బయటకు వస్తున్న మేకర్స్ మాత్రం ఈ రూమర్స్ పై స్పందించడం లేదు.చూడాలి ఈ సినిమా నుండి అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube