ప్రస్తుతం ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది.సాధారణ ఫోన్ నుంచి ప్రస్తుతం 5జీ స్పీడ్‌తో కూడిన ఇంటర్‌నెట్ స్మార్ట్ ఫోన్లను మనం వాడుతున్నాం.
ఏ దేశానికి వెళ్లాలనుకున్నా విమానాల్లో గంటల వ్యవధిలో వెళ్లొచ్చేస్తున్నాం.అంతరిక్షానికి మనుషులు వెళ్లే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో వింత ఆచారాలు పాటిస్తున్నారు.కట్టుబాట్లు పేరుతో మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.
ఇదెక్కడో కాదు.ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ వింత గ్రామం ఉంది.
పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని వేమన ఇండ్లు గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇక్కడి పద్ధతులు, కట్టుబాట్లు చాలా విచిత్రంగా ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుందాం.
ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.
బయటకు వెళ్లినప్పుడు కూడా ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్తారు.ఈ గ్రామంలో ప్రస్తుతం 25 ఇండ్లు ఉన్నాయి.
వారంతా స్థానికంగా విధించిన ఆచారాలను పాటిస్తారు.ఎవరైనా తమ గ్రామానికి వచ్చినప్పుడు కూడా వారు సైతం చెప్పులు వేసుకోకూడదనే నిబంధనలు పెడతారు.
ముఖ్యమంత్రి వచ్చినా ఆ గ్రామంలో చెప్పులు వేసుకోకూడదు.అంతేకాకుండా ఇతరులను వారు అస్సలు తాకరు.
ఎక్కడికైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఫుడ్ అస్సలు తినరు.తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వారు భోజనం చేస్తారు.
ఇక గ్రామంలో మహిళలకు నెలసరి వస్తే ఖచ్చితంగా ఊరి బయట ఉండాలి.

అందుకోసం రెండు ప్రత్యేక ఇళ్లను సైతం నిర్మించారు.కరోనా వచ్చినప్పుడు కూడా వారు వ్యాక్సిన్లు వేసుకోలేదు.ఎవరూ ఆసుపత్రికి కూడా వెళ్లలేదు.
గర్భిణులను కూడా వీరు ఆసుపత్రులకు తీసుకెళ్లరు.గ్రామంలోనే ప్రసవం చేస్తారు.
చివరికి పాము కాటు వేసినా, ఆసుపత్రులకు వెళ్లరు.ఆ గ్రామంలోని పుట్ట చుట్టూ తిరిగితే విషం విరుగుడు అవుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు.
ఈ గ్రామస్తులంతా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు.ఇక జంక్ ఫుడ్ అస్సలు తినరు.
సంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో ఇంకా ఈ గ్రామ ప్రజలు మూఢ నమ్మకాలను పాటించడం చాలా విచిత్రంగా ఉంది.