టాలీవుడ్ జబర్దస్త్ కమెడియన్ వేణు( Comedian Venu ) డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన సినిమా బలగం( balagam ).ఇటీవల ఇటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాకుండా ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు.
ఎన్నో కుటుంబాలను ఈ సినిమా మళ్లీ కలిపిందని చెప్పవచ్చు.కొన్ని ఏళ్ల నుంచి పగలు ప్రతీకారాలతో కోపంతో రగిలిపోతున్న ఫ్యామిలీలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ఒక్కటయ్యాయి.
అంతేకాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే.మరి ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టాల్సిందే.ఇక ఈ సినిమాలో నటుల నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇక బలగం సినిమా తర్వాత అందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు దక్కింది.
ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్( Priyadarshi, Kavya Kalyan Ram ) జంటగా నటించగా మిగతా నటీనటులు ప్రేక్షకులకు పరిచయం లేని వారే.కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా తన నటనతో నవ్వించింది.

ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలకు గుర్తుండిపోయింది.తనే సౌదామిని( Soudamini ).ఇందులో సినిమాలో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని.కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం అక్కడ ప్రియదర్శి సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే కేవలం ఎక్స్ప్రెషన్స్తో సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించాయి.ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా తన ఎక్స్ప్రెషన్స్తో బాగా ఫేమస్ అయ్యింది సౌదామిని.
ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఈ సినిమా కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సినిమా అడిషన్కు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు.

సిగ్గు పడగానే సెలక్ట్ చేశారు.సౌదామిని పేరును వేణు సర్ సౌమ్య పిలిచారు.ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉంటారు.సినిమా కోసం పది కేజీలు పెరిగాను.కేకులు తినేసి బరువు పెరిగాను.ఫన్ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం.
నా ఫస్ట్ సినిమా ఇదే.బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశాను.చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది.ఎక్కడికి వెళ్లినా అన్నయ్యతో వెళ్తాను.చాలా మంది నువ్వు నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాల్లు.నేను స్థాయికి రావడం కారణం వేణు సర్.బలగం సినిమా చూసి డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు.మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు అని చెప్పుకొచ్చింది సౌదామిని.







